చిన్నగెడ్డ గ్రామంలో జనసేన మండల స్థాయి సమావేశం

అరకు, చింతపల్లి మండలం చిన్నగెడ్డ గ్రామంలో జరిగిన మండలస్థాయి జనసేన సమావేశంలో మండల పరిధిలో గలా పది పంచాయితీల ముఖ్యనాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణమే మనకు శిరోధార్యమని, ఎందుకంటే ఏ పార్టీ ఈ ఆంద్రప్రదేశ్ ఏలినా తరాలుగా ఈ ప్రాంతపు ఆదివాసీ ప్రజలు అన్యాయానికి గురౌతున్నారని ప్రస్తుతం ప్రజలందరూ గమనిస్తున్న సత్యమని, అవినీతి లేని పాలన, ప్రకృతి సంస్కరిస్తూ అభివృద్ధి, కులాలను కలిపే ఆలోచన, వంటి గొప్ప సిద్ధాంతాలతో ప్రజా పాలన సాగాలంటే జనసేనతోనే సాధ్యమని జనసేన నాయకులు దేపురం రాజు (చెరపల్లి నుంచి) ప్రసంగించారు. వంతల బుజ్జి బాబు ప్రసంగిస్తూ ముందుగా మణప్రాంత భౌగోళిక విశిష్టత, మన ఆచార వ్యవహారాలు, మన ప్రాంత గొప్పతనం నానాటికి కోల్పోతున్నాం అడుగడుగున దగా పడుతూనే ఉన్నాం, ఈసారైనా మేలుకుందాం ఇప్పటికే జనసేనకు బలమైన ప్రజాభిమానం ఉంది నిజాయితీగా ఆలోచన చేసే యువశక్తి, తోడుగా ఉందని రానున్న సమీపభవిష్యత్ లో జనసేన అధికారం చేబడుతుందని ప్రసంగిచారు. త్వరలో చింతపల్లి మండలంలో అరకు, పాడేరు పార్లమెంట్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ వంపురు గంగులయ్య ఒక సమావేశం పెడతారని చెప్పారు. ఈ సమావేశంలో చిన్నగెడ్డ జనసైనికుడు కె.పండు నివాసం జరిగింది. కె.ప్రసాద్, డి.గిరి, డి. దారబాబు, డి.దుర్గాప్రసాద్, డి.వంశీ, ఎం.ఉమాశంకర్, లోతుగెడ్డ పంచాయితీ, శెట్టి స్వామి, రవి, టి.అక్షయ్, భద్రం, కిముడు రామరాజు, తదితర మంది జనసైనికులతో క్రియాశీలక సభ్యత్వం, పార్టీని ప్రజలకు చేరువ చేసే విదానము కోసం చర్చించారు.