చింతలపూడిలో అంగన్వాడి వర్కర్ల సమ్మెకు జనసేన మద్దతు

ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం, చింతలపూడి మండలంలో అంగన్వాడి వర్కర్లు చేపట్టిన మూడవరోజు సమ్మెలో జనసేన నాయకులు పాల్గొని జనసేన పార్టీ తరఫున పూర్తి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల అధ్యక్షులు చిత్రాల మధుబాబు, మండల కార్యదర్శి పూలేటి సునీత, ఎర్రంపల్లి రమేష్, కృష్ణారావు, రాము, చెన్నకేశవరాజు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.