చీపురుపల్లిలో జనసేన-టిడిపి-బిజెపి ఆత్మీయ సమావేశం

చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిడిపి పార్టీ నుండి కిమిడి కళా వెంకటరావుని నియమించినందుకు గాను వారి యొక్క ఆహ్వానం మేరకు మంగళవారం చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు జనసైనికులు వీరమహిళలలు భారీ సంఖ్యలో పాల్గొని కిమిడి కళా వెంకటరావుకి దుశ్శాలువాతో సత్కరించి, అలాగే వారి కుమారుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడుని కూడా సత్కరించి కృతజ్ఞత అభినందనలు తెలియజేసారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరపున మా సాయశక్తులా మా వంతు బాధ్యతగా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని, అఖండ మెజారిటీతో గెలిపించుకుని తీరుతామని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి రమేష్ రాజు, జనసేన పార్టీ స్పోక్స్పర్సన్ రేగిడి లక్ష్మణరావు, జనసేన నాయకులు రామచంద్రరావు, శంకర్, నరసింహ, కృష్ణమూర్తి, సింహాచలం, రమణ, ఆదినారాయణ, బిఎ నాయుడు మరియు జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.