ఘనంగా జనసేన వీర మహిళ గొన్న రమాదేవి జన్మదిన వేడుకలు

మండలంలోని గొన్న వాని పాలెంకు చెందిన జనసేన వీర మహిళ గొన్న రమాదేవి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి జనసేన కార్యకర్తలు రమాదేవి ఇంటికి వచ్చి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె అభిమానులు అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం లంకెలపాలెం సమీపంలో కన్నూరు గ్రామంలో ఉన్న లక్ష్మీ జనార్ధన స్వామి వేద పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన స్మార్త పుస్తకాలు ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పుప్పాల దిలీప్ కుమార్, భారతి, గొల్లవిల్లి నానాజీ, రాజు, హేమంత్, తదితరులు పాల్గొన్నారు.