కొండ్రుప్రోలు గ్రామంలో జనసేన పల్లె పోరు

తాడేపల్లిగూడెం, జనసేన పల్లె పోరులో భాగంగా తాడేపల్లిగూడెం మండలం, కొండ్రుప్రోలు గ్రామంలో జనసేనలోకి బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. జనసేన పల్లె పోరులో భాగంగా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ జనసేన పల్లె పోరులో బాగంగా ఇంటింటికీ తిరుగుతూ వచ్చే ఎన్నికలో మీ ఓటు హక్కుతో ఓటును వినయగించుకొని వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి శాశ్వతంగా దించి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని గ్రామ ప్రజలను కోరారు. అనంతరం కొండ్రుప్రోలు గ్రామం నుంచి జాన నాగరాజు కంకిపాటి గంగాజలం, రుద్ర రామచంద్రరావు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండలం అడపా ప్రసాద్ అధ్యక్షతన ఓసి, బీసీ, ఎస్సి మైనార్టీల నుంచి వంద మందికి పైగా జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు డి.సురేష్, డి.శ్యంబాబు, ఎస్.కె. మధు, ఎం.రాజు, ఎం.రమేష్, ఎన్.రాంబాబు, కె.ఏసు, డి.ప్రవీణ్, పి.కిషోర్, డి.చిన్న పండు, ఏ.రవి, ఆర్.సాయి, ఆర్.నాయుడు తదితరులు మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.