జనసేన నేత పవన్ కళ్యాణ్ కు జననీరాజనాలు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో జనసేన నేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న మత్స్యకార అభ్యున్నతి సభకు కోనసీమజిల్లా నుండి జనసైనికులు తరలివెళ్లారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెం లో జనసేన నేత పవన్ కళ్యాణ్ కు అఖండ ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. గ్రామ గ్రామాల నుండి సభకు తరలి వెళ్ళారు.