పాడేరులో అంబరాన్నంటిన జనసేనాని జన్మదిన వేడుకలు

పాడేరు నియోజకవర్గం: పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసైనికులు, వీరమహిళలు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో శనివారం అట్టహాసంగా జరిగాయి. వేడుకలలో భాగంగా ముందుగా శనివారం ఉదయం ఆదివాసీ ప్రాంతపు ఇలవేల్పు శ్రీ మోద మాంబ అమ్మవారి ఆలయానికి చేరుకుని జనకులగోత్ర, ఉత్తరాషాఢ నక్షత్ర, మకర రాశి పవన్ కళ్యాణ్ పేరిట జన్మ వృత్తాంత అర్చన చేయించడమైనది. పాడేరు జి.మాడుగుల మండలాల నుంచి అశేషంగా తరలివచ్చిన అభిమానులు, జనసైనికులు, వీరమహిళలతో కార్యాలయం నుంచి పాడేరు పుర వీధుల్లో 67 వాహనాలతో బారి ర్యాలీ నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పాడేరు నియోజకవర్గ నాయకులు ఈ సందర్బంగా దింశ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చూపరులను బాగా ఆకట్టుకుంది. అలాగే తరలి వచ్చిన 300 మంది మహిళలకు శ్రావణ లక్ష్మీ సన్మాన కార్యక్రమాలు నిర్వహించచి, భవన నిర్మాణ కార్మిక సోదరులతో సహపంక్తి భోజన కార్యక్రమం చేయడమైనది. అనంతరం సుమారు 45 మంది వరకు మహిళలు స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఇన్చార్జ్ గంగులయ్య పార్టీలో కి సాదరంగా ఆహ్వానించారు. వారి నుద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్ లో ఎటువంటి సమస్యనైనా మీకు అండగా జనసేన పార్టీ ఉంటుందని మీ గొంతుకలో స్వరంలా నిలబడతామని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి సీఎం చేద్దామని అన్నారు. అధినేత ఉత్సవ జన్మదిన వేడుకలలో జి.మాడుగుల మండల ముఖ్యనాయకులు, వీరమహిళలు కిటలంగి పద్మ, దివ్యలత, దుర్గాలత, నందోలి మురళీకృష్ణ, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, వంపూరు సురేష్, కమల్ హస్సన్, అశోక్, మసాడి భీమన్న, కిల్లో రాజన్( లీగల్ అడ్వైజర్)మస్తాన్, తాంగుల రమేష్, భానుప్రసాద్, తల్లే త్రిమూర్తి, జంగిడే ఈశ్వర్రావు, బాబూరావు, సాగెని ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.