పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో జనసేనుని జన్మదిన వేడుకలు

జనగామ: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనగామ జిల్లాలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు &సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా జనగామ పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ, జనగామ రైల్వే స్టేషన్ దగ్గర అనాధలకు, అభాగ్యులకు అల్ఫాహారం, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. జనగామ చౌరస్తాలో జనసేనవీర మహిళ మల్యాల హేమ విచ్చేసి కేక్ కట్టింగ్ చేయడం జరిగింది. జనగామ పట్టణంలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్, అభిమానులు, జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో రక్త దానం కార్యక్రమం చేపట్టగా, పలువురు రక్త దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ వ్యవస్థాపకులు జోగు భాస్కర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అలేటి నరేందర్, కామెడీ జంపన్న ఉప్పల్ క్రాంతి మంద నాగరాజు జోగు ఉదయ్, వేదాంతం ఉదయ్, మంద అంబాల శివ గౌడ్, నరేంద్ర పవన్, కుర్బాన్, రంజిత్, నలిన్, దిలీప్, ఉమేష్ రోహిత్, సాయి పెంబర్తి పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ సభ్యులు మేకల శ్రీకాంత్, ఆలకుంట్ల ప్రశాంత్, తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *