బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

  • బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేనానికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

రాజోలు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం రాజోలు నియోజకవర్గం రాజోలు-రోటరీ క్లబ్ నందు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో నూతనముగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ మండల కమిటీ సభ్యులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, స్థానిక ఎలక్షన్ ‌లో పోటీచేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, అభ్యర్థులకు, సర్పంచ్ లకు, సభ్యత్వం నమోదు చేసిన జనసేన క్రియా వాలంటీర్ లకు చిరు సన్మానం కార్యక్రమం జరిగింది. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా కందుల దుర్గేష్ గారు – జనసేన పార్టీ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, పార్టీ మండల అధ్యక్షులు, జనసేన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు అందరూ పాల్గొన్నారు.