విజయచంద్ర గెలుపే జనసేన లక్ష్యం

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మణి అధ్యర్యంలో జనసేన పార్టీ మండల టీం గ్రామ బాట చేపట్టింది. రానున్న ఎన్నికల్లో భాగంగా మండలంలో 8 గ్రామ పంచాయితీలలో జనసేన గ్రామ బాట నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. అయితే, మొదటగా పెదమరికి పంచాయతీలో శివన్నదొర వలస, చందలింగి, కొత్త చందలింగి గ్రామాలలో గ్రామ బాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షురాలు ఆగూరు మణి మాట్లాడుతూ.. ముఖ్యంగా సూపర్ సిక్స్ పధకాలు ఆవశ్యకతను గూర్చి వివరించారు. గ్రామ పెద్దలు, యువతతో కలిసి గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్డు, పెన్షన్లు, రక్షిత త్రాగునీరు, ఆగిన ఇల్లు, కాలువలు, పారిశుద్ధ్యం గురించి పరిష్కారించే దిశగా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు జిల్లా కార్యక్రమాల కార్య నిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, ఖాతా విశ్వేశ్వరరావు, అక్కెన భాస్కరరావు, బొండపల్లి జనార్ధన, ఆగూరు మహేష్, అగ్గాల నవీన్, ప్రసాద్, రమేష్ , బాషా మరియు తెలుగు దేశం పార్టీ స్థానిక నాయకులు పీడక లక్ష్మణరావు, ఊయక వాసు, విజయ్, గౌరి, శ్రీను తదితరులు మరియు ఆ గ్రామ పెద్దలు, యువత అందరూ పాల్గొని విజయవంతం చేశారు.