పరిగిలో జనసేనుని జన్మదిన వేడుకలు

పెనుకొండ నియోజకవర్గం: పరిగి మండలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మండల అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో పరిగిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పాలు, బ్రెడ్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు రమేష్ పాల్గొని కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది. కార్యక్రమంలో మండల నాయకులు బాలచంద్ర, శివశంకర్, రామాంజి, రవితేజ, సంజీవ మూర్తి, రమేష్, గిరీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.