జోగి రమేష్ అనుచరులు రాత్రంతా బెదిరింపు ఫోన్ కాల్స్: ఎస్.వి.బాబు

  • తీవ్ర మానసిక ఒత్తిళ్ళకు గురి చేస్తున్నారు

పెడన, సోమవారం (22-08-2022) రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు జోగి రమేష్ ఆఫీస్ నుండి జోగి రమేష్ అనుచరులు కంటిన్యూగా నాకు ఫోన్ చేస్తూ బండ బూతులు తిడుతూ, నన్ను, నా కుటుంబ సభ్యులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. ఉదయం మాట్లాడుకుందాం అని ఎంత చెప్పినా వినకుండా వందలసార్లు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టారు. జోగి రమేష్, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నేను ఖండించాను. అంతేకాకుండా పెడన పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఒకరి ఫ్లెక్సీలను మరొకరు చించుకుంటూ నానా రచ్చ చేసిన విషయాం అనేక పత్రికల్లో మరియు టీవీల్లో రావడం జరిగింది. ఆ విషయాన్ని నేను మాట్లాడం జరిగింది. అంతే జోగి రమేష్ తన అనుచరులతో ఫోన్ చేయించి నిన్ను చంపేస్తామని బెదిరించడం జరిగింది. దమ్ముంటే పెడన రావాలని పెడనొస్తే మరల తిరిగి వెళ్ళవని నన్ను హెచ్చరిస్తున్నారు.

నాకు ఫోన్ కాల్ చేస్తున్న వ్యక్తుల పేర్లు వారి ఫోన్ నెంబర్లు

  1. మహమ్మద్ మతిన్ పెడన – 9948928767
  2. ఐబిఎం వేమనేడి – 7729835118
  3. ఇమ్రాన్ వైఎస్ఆర్సిపి పెడన – 9866214198
  4. డొకోమో సాంబ వీధిమెడు గ్రామం- 8555828258
    9030601090
  5. కొండవీటి నాగబాబు లంకలకులగుంట- 9441193981
  6. జోగి సాయి – 9030840338

నాకు కాల్ చేసి బెదిరించిన విషయాన్ని పెడన ఎస్సైకి, సిఐకి, ఇంటిలిజెన్స్ అధికారులకు తెలియజేయడం జరిగింది. అధికారులు స్పందించిన తీరు అభినందనీయం. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మంగళవారం(23-08-2022) రాత్రి మరలా ఫోన్ చేయటం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరలా నాకు కాల్స్ చేయటానికి చూస్తుంటే పోలీసు వారు వాళ్లపై చర్యలు తీసుకోలేదా? లేదా పోలీసు వ్యవస్థ అంటే వాళ్ళకి భయం లేదా? అనే అనుమానం కలుగుతుంది. వీళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఇదేవిధంగా వదిలేస్తే రాబోయే రోజుల్లో వీళ్ళందరూ అరాచక శక్తుల రూపాంతరం చెంది పెడన నియోజవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ప్రమాదం ఉంది. ఇప్పటికీ నాకైతే పోలీసు వ్యవస్థ మీద అపారమైన గౌరవం నమ్మకం ఉంది. ఎలాగో ముఖ్యమంత్రి 25 తేదీన పెడనకు వస్తున్నారు కనుక ప్రత్యక్షంగా ముఖ్యమంత్రికి కలిసి వినతిపత్రం అందజేస్తాం. పెడన నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు జనసేన పార్టీ నాయకులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. పెడన నియోజకవర్గ ప్రజలు జోగి రమేష్ యొక్క నీచ రాజకీయాలను, దిగజారుడు రాజకీయాలను గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు.