జనసేన పార్టీలోకి మత్స్యకారుల చేరికలు

  • పార్టీ కండువాకప్పి ఆహ్వానం పలికిన ఇంచార్జి మాకినీడి శేషుకుమారి
  • వైసీపీ టీడీపీల నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరామన్న యవత

కాకినాడ జిల్లా, మంగళవారం పిఠాపురం పార్టీ కార్యాలయంలో ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి పిరమళ్ళ ప్రసాద్ తో 25 మంది ముత్స్యకారులు, మండల అధ్యక్షులు పట్టా శివ, మండల ఉపాధ్యక్షుడు దొడ్డి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి సమక్షంలో జనసేన పార్టీ తీర్దం పుచ్చుకోవడం జరిగింది. వారికి జనసేన ఇంచార్జ్ శేషుకుమారి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెయజేసారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… ఎన్నో ఏళ్ళుగా ముత్సకారులను ఏ రాజకీయ పార్టీ పంచుకోలేదని, కాని జనసేన పార్టీ మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న తీరుకు పవన్ కళ్యాణ్ సిద్దంతాలు ఆశయసాదనకు ఆకర్షణీయులమై పార్టీలో చేరికకు కారణమయిందని, అలాగే ఇంచార్జి గారు అడుగుల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని మీడియాలో వివరించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఇప్పటికే పలువూరు పార్టీలో చేరడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాయపట్టణకు చేసిన అభివృద్ధి ఏమి లేదని చెప్పటం జరిగింది. జనసేన పార్టీ మీ గ్రామ అభివృద్ధి గ అడుగులు వేస్తుందని ఒక భరోసాని ఇస్తున్నానని, ప్రజలు జనసేన వైపు మళ్ళుతున్నారని, పంటలు నష్టం వాటిలిన కౌలు రైతును ప్రభుత్వం కన్నేత్థి చూడకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు పవన్ కళ్యాణ్ మనసును కలసివేసిందని, కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి కౌలు రైతుల్ని ఆదుకోవడం, అలాగే మొన్న రామన్న పాలెం గ్రామంలో క్రియాశీలక జనసైనికుడు యాక్సిడెంట్లో మరణిస్తే వారికి పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయలు ప్రమాద బీమాని స్వయంగా ఇంటికి వచ్చి నాదెండ్ల మనోహర్ అందజేయటం జరిగిందన్నారు. జనసేన పార్టీలో చేరిన ముత్స్రకారులకు తొందర్లో మంచి రోజులకు మార్పుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని, మనమందరం పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి అందరూ కష్టపడాలి, ప్రతిఒక్కరికి ప్రధాన్యత కల్పిస్తున్నామని మీ అందరికీ అండగా ఉంటానని హామీచ్చారు. ఈ కార్యక్రమంలో. మండల అధ్యక్షులు పట్టా శివ, అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, దొడ్డిదుర్గ ప్రసాద్, పుణ్యమంతుల మూర్తి, గోపు సురేష్, ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యాకర్రావు, గారపాటి శివ కొండారావు, ఏరిపిళ్లి రవి, పీక్కి ఆనంద్, దూడ మల్లి, మోస డేవిడ్, మడడం శామ్యూల్, దూడ శ్రీను, మైలపిల్లి కోదండ, బడి సతీయ్యా, కొవ్విరి ప్రసాద్, పీక్కి తాతారావు, పీక్కి జాగత్త, మోస తాటిల్లు, వాసంశెట్టి ప్రశాంత్,సురాడ శ్రీను,కంద సోమరాజు, రాము, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.