కాపు నాయకుల సమావేశం కేవలం జనసేనపై బురద చల్లాలని చేసిన కుట్ర

  • వైసీపీ కాపు ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏర్పాటు చేసుకున్న సమావేశం కేవలం జనసేనపై బురద చల్లాలని చేసిన కుట్ర.
  • జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా

గురజాల, కాసిం సైదా పత్రికా ముఖంగా మాట్లాడుతూ వైసీపీలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాపు నాయకులు సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని, కాకపోతే ఈ సమావేశంలో కాపులకు జరిగిన అన్యాయం గురించి గానీ, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న సంవత్సరానికి 2000 కోట్లు గురించి గానీ, కాపుల్ని ఎలా అభివృద్ధి చేయాలా అనే దాని మీద గాని సమావేశంలో చర్చించుకుని ఏదైనా తీర్మానం చేసుకుంటే కాపులతోపాటు మిగిలిన కులాల వారు కూడా అభినందించే వారని అలాకాకుండా తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ అనుసరిస్తూ కేవలం జనసేన పార్టీకి రాష్ట్ర ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ఎక్కడ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే తమ యొక్క అవినీతి బయటపడుతుందో అనే భయంతో పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ మీద బురదజల్లే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం నిర్వహించారని అన్నారు. కాపుల సమావేశంలో వెనుక ఏర్పాటు చేసుకున్న బ్యానర్లో కనీసం వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకోలేని దినస్థితిలో ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నార అన్నారు. ఎన్నికలప్పుడు రంగా పేరు చెప్పుకొని ఓట్లు సంపాదిస్తున్నారే కానీ ఆయన పేరును ఒక జిల్లాకైనా పెట్టమని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. జనసేన మీద కులముద్రవేయాలనే కుట్ర జరుగుతుందని, దీన్ని ప్రతి ఒక్క జనసైనికుడు గ్రహించి వారి కుట్రను భగ్నం చేయాలని కోరారు.