పురిటిగడ్డ గ్రామంలో జనసేనలో చేరికలు

అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలంలో పురిటిగడ్డ గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత ఎక్కువ మొత్తంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్, షరీఫ్, చల్లపల్లి టౌన్ ప్రెసిడెంట్ బందులపాటి వీరబాబు, మండల ప్రధాన కార్యదర్శి తోట మురళికృష్ణ, జనసైనికులు పసుపులేటి రవి, రాఘవ కూరేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు జనసైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.