జనసేనలో చేరికలు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, ఆర్కే విబిపేట పంచాయతీ, తెలుగుదేశం పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్రగిరి చంగల్ రాయలు, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నా నేతృత్వంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ సమక్షంలో ఆర్కే విబీపేట వైసీపీ యువత బి.సోము, బి.సుధాకర్, వి.కన్నయ్య, బోసు, సంపూర్ణయ్య, భాగ్యరాజ్, వారితోపాటు 150 మంది యువత తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ వి.ఎం థామస్ గెలుపు కోసం ప్రాణత్యాగం చేయడానికి అయిన సిద్ధమని ఇందిరాకాలనీ జనసేన పార్టీ నాయకులు భరోసా ఇచ్చారు.