టి.సుండుపల్లె మండలంలో జనసేన, బీజేపీ, టిడిపిల ఉమ్మడి ప్రచారం

రాజంపేట నియోజకవర్గం: టి.సుండుపల్లె మండలం, మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీలో పాలెంగడ్డ బిడికి, రెడ్డివారిపల్లె, బండి మాలపల్లె, తొగురుపల్లి, మాచిరెడ్డిగారిపల్లె, వాయలొడ్డు బిడీకి, చిన్న బిడికి, వంకవార బిడికీ తదితర గ్రామాల్లో.. రాజంపేట జనసేన, బీజేపీ, టిడిపి అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం సోదరుడు టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు మరియు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు, టీడీపీ మండల అధ్యక్షులు కలే రెడ్డప్ప, రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరామరాజు హాజరై రాజంపేట ఎన్ డి ఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రమణ్యం గారికి తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు వివిధ రకాల పదాదికారులు, స్థానికులు, పలు గ్రామలవారు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.