జనసేన పార్టీ ఐటి చైర్మన్ మిరియాల శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటి కోఆర్డినేటర్లు

హైదరాబాద్, ప్రశాశన్ నగర్ లో గల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటి ఇంఛార్జి గాలిదేవర తమ్మేష్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాల ఐటి కో ఆర్డినేటర్లు జనసేన పార్టీ ఐటి వింగ్ చైర్మన్ శ్రీనివాస్ మిరియాలని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మిరియాల మాట్లాడుతూ నియోజకవర్గాలలో ఐటి విభాగాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, జనసేన పార్టీ ఐటి టీమ్ డెవలప్ చేసిన అస్త్ర యాప్ ని ఏ విధంగా క్రియాశీలక సభులకు మరింత చేరువ చేయాలి అనే వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐటి ఇంఛార్జి గాలిదేవర తమ్మేష్, అమలాపురం ఐటి కోఆర్డినేటర్ వేణు పలచోళ్ళ, రాజోలు ఐటి కోఆర్డినేటర్ ఎనుముల లక్ష్మణ్, మండపేట ఐటి కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్, ముమ్మిడివరం ఐటి కోఆర్డినేటర్ ప్రకాష్ మరియు ముమ్మిడివరం సోషల్ మీడియ ఇంచార్జ్ గాలిదేవర వినోద్, రంపచోడవరం ఐటి కోఆర్డినేటర్ దుర్గ, రాజానగరం ఐటి కోఆర్డినేటర్ శ్రీరంగం వెంకట రమణ, రామచంద్రపురం ఐటి కోఆర్డినేటర్ చంద్రశేఖర్, పిఠాపురం నుండి రాజేష్, కె.ఎన్ టివి చైర్మన్ గంగా సురేష్ బండారు మరియు శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల తదితరులు పాల్గొనడం జరిగింది.