ఘనంగా కడప జిల్లా చిరంజీవి యువత ఆత్మీయ సమావేశం

కడప చిన్న చౌక్ బైపాస్ రోడ్ లో ఉన్న ఆదిత్య రెసిడెన్సి ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి కడప జిల్లా చిరంజీవి యువత నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

జిల్లా అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర మరియు కడప జిల్లా జనసేన నాయకులు ప్రముఖ ఎన్.అర్.ఐ మంగారపు నరసింహ ముఖ్య అతిథులుగా పాల్గోని చిరంజీవి యువత కమిటీలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆగస్టు, సెప్టెంబర్, నెలలలో జరిగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పుట్టిన రోజు వేడుకలపై చేపట్టాల్సిన సేవా కార్యక్రమాల గురించి చర్చించారు.

ఆగస్టు 17వ తేదీన కడపలో జరిగే మెగాస్టార్ డాన్స్ పోటీలను విజయవంతం చేయాలని అన్నదాన, రక్తదాన, మొక్కలు నాటే, కార్యక్రమాలు చేయలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో అంజి, జయరాజు, మాదాసు నరసింహ, రామారావు, షరీఫ్, మహేష్, నవీన్,జయరాం, గుగ్గీళ్ళ వెంకటేష్, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, కృష్ణ, భరత్, పగడాల మణి, ఈశ్వర్ రెడ్డి, ఖాలీల్ భాష, గోవర్ధన్ ఆచారి, అల్లం సూర్యనారాయణ, పవన్ కుమార్, తరుణ్, పెద్దరాం, రాహుల్, మెహన్, జిలానిబాష, చెన్నా రంగయ్య, మధు, మౌలాలీ, మన్యం చిన్నా, తదితరులు పాల్గొన్నారు.