అంధకారంలో కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్

కదిరి నియోజకవర్గం: కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు రోజుల హాస్పిటల్ అంధకారంలోనికి వెళ్ళింది. ఈ పరిస్థితిపై స్పందించిన జనసేన పార్టీ జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అత్యవసర ల్యాబ్, ఎక్స్-రే, బ్లడ్ సెంటర్ వంటి విభాగాల్లో గత రెండు రోజులుగా కరెంట్ లేకపోవడం వల్ల కదిరి చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో ఎక్స్-రే, రక్త పరీక్షలు జరగక పోవడం కారణంగా హాస్పిటల్ కి వచ్చే సాధారణ మధ్య తరగతి పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ ను సంప్రదించాల్సిన దుస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం వచ్చే వారికి బ్లడ్ నిలువ చేసే ఫ్రిడ్జ్ లు కరెంట్ లేని కారణంగా రక్తం కూడా పాడయిపోయే అవకాశం ఉండటంతో ఫిమేల్ వార్డ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లోకి మార్చారు. అంటేనే సమస్య ఎలా ఉందో అని అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు హాస్పిటల్ నందు వైద్యుల కొరత, నర్సుల కొరత తీవ్రంగా ఉందని అత్యవసర సేవలు అందించడం లేదని చిన్న చిన్న సమస్యలకే అనంతపురం, బెంగళూర్, తిరుపతి వంటి ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు అని గతంలో కూడా జనసేన పార్టీ తరపున అధికారుల దృష్టికి తీసుకొని వచ్చాము అయినా, ప్రభుత్వ అధికారులు, హాస్పిటల్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ఇదే విధంగా అధికారుల నిర్లక్ష్యం వీడక పోతే మాత్రంపై అధికారులకు ఫిర్యాదు చెయ్యాల్సి వస్తుందని కదిరి జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నామని జనసేన పార్టీ జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, జయ వర్ధన్, చరణ్, తేజ అన్నారు.