భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ

భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ప్రకృతి ప్రసాదించిన ఉల్లాసకరమైన పండుగ ‘హోలీ’ వసంత ఋతువులో వచ్చే ఈ పండుగను వసంతోత్సవంగా జరుపుకొనే ఈ వేడుక వేళ దేశ ప్రజలందరికి నా తరపున, జనసేన తరపున ఆనందకర హోలీ శుభాకాంక్షలు. మన దేశంలో వివిధ పేర్లతో, వివిధ పురాణాల నేపధ్యంలో ఈ పండుగ జరుపుకొంటున్నప్పటికీ భారతీయలు ఐక్యతకు ప్రతీకగా హోలీ శతాబ్దాల తరబడి విరాజిల్లుతోంది. రంగులు, పూల సమ్మేళనంతో నిండి ఉండే ఈ పండుగలానే ప్రజలందరి జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖ శాంతులు విరబూయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ పండుగను ప్రకృతి పరంగా లభించే సహజ సిద్ధమైన రంగుల మిశ్రమాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Happy Holi ❤️ #Holi #HappyHoli #pawankalyan #VoteForGlass #janasenaparty |  Happy holi, Holi, Happy