రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలో జనసేన పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన యాడికి మండలం ఇంచార్జ్ కోడి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముందుగా నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ అందులో భాగంగా కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో 90 మంది రక్త దానం చేయడం జరిగిందని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోవు రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలతో ప్రజలలోకి వెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా క్రౌడ్ ఫండింగ్ నిర్వహించి కార్యకర్తలతో కూడా పార్టీకు ఫండ్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల అధ్యక్షులు కోడి సునీల్ కుమార్ మాట్లాడుతూ తమ మీద నమ్మకంతో ఈ కార్యక్రమం అప్పగించిన శ్రీకాంత్ రెడ్డికి ఇందులో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిదంగా తాడిపత్రి పట్టణంలో చిరంజీవి రాష్ట్ర యువత తరుపున అధ్యక్షుడు ఆటో ప్రసాద్ అధ్వర్యంలో కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అందులో 80 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కె.ఎన్ చారి, నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్ మరియు జనసైనికులు అయుబ్, మణికంఠ, రసూల్, గోపాల్, శివ, వెంకటేశ్, జాకీర్, దస్తగిరి, మనికిషోర్, నరేష్, అలి తదితరులు పాల్గొన్నారు.