విసినిగిరి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన కళా వెంకట్రావు

చీపురుపల్లి నియోజకవర్గం, జనసేన-టిడిపి-బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు, వారి తనయుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడుతో పాటు చీపురుపల్లి నియోజకవర్గం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కలిసి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జనసేన మెరకముడదాం మండల పార్టీ అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు గుర్ల జనసేన మండల పార్టీ అధ్యక్షులు యడ్ల సంతోష్ ఇరువురిని శాలువాతో సత్కరించిన అనంతరం వీరమహిళలు హారతిని ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. జనసేన పార్టీ తరఫున తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. కిమిడి కళావెంకటరావు గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని జనసేన సీనియర్ నాయకులు దంతులూరి రమేష్ రాజు జనసేన స్పోక్స్ పర్సన్ రేగిడి లక్ష్మణరావు జనసేన నాయకులు అట్టాడ కనికం నాయుడు శిడగం రామచంద్రరావు నూకరాజు జడ్డు ఆదినారాయణ కర్ణ కనకరాజు పిన్నింటి రాజు బి నాయుడు జనసైనికులు, వీర మహిళలు తమ మద్దతు తెలిపారు.