నిత్య వైద్యానికి సహాయం అందించిన కనపర్తి నారాయణ మిత్ర బృందం

  • మానవత్వం చాటుకున్న కనపర్తి నారాయణ

ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో, పొన్నలూరు మండలంలో వేంపాడు గ్రామానికి చెందిన మద్దిరాల హరీష్ మరియు మానస దంపతుల కూతురు అయిన మద్దిరాల నిత్య అనే 18 నెలల చిన్న పాప హైదరాబాదులో 18-7-22 వ తేదీన మొదటి అంతస్తు మెట్ల మీద నుండి జారి కింద పడిపోయింది. ప్రమాదవశాత్తు మెదడులోని నరాలు దెబ్బ తిన్నవి. వారు చాలా పేదవారు. దయచేసి తమ వంతు ఆర్థిక సహాయం అందజేసి, ఆ పాపకు పునర్జన్మ ను ప్రసాదించవలసిందని పాప తల్లిదండ్రులు పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ని అడగడం జరిగింది, మనోజ్ కుమార్ వెంటనే స్పందించి వారి మిత్ర బృందానికి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 30 వేల రూపాయలు కూడా మనోజ్ కుమార్ మిత్రబృందం పాప తల్లిదండ్రులకు పంపించడం జరిగింది,

పొన్నలూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన కనపర్తి నారాయణ మిత్రబృందం వెంటనే స్పందించి 60,000 రూపాయలు సోమవారం ఉదయం యశోద హాస్పిటల్ కి వెళ్లి పాప వైద్య ఖర్చుల నిమిత్తం కోసం పాప తల్లిదండ్రులకు కనపర్తి నారాయణ మిత్ర బృందం కనపర్తి నారాయణ (15000), అప్పారావు (10,000), మోహన్ రావు (10,000), మ్యాస్టిక్ (10,000), సంతోష్ (10,000), నరసింహ (5000) సహాయం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా పాప వైద్యానికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలి అని కనపర్తి నారాయణ తెలిపారు. నిత్య తల్లిదండ్రులు కనపర్తి నారాయణ కి కృతజ్ఞతలు తెలియజేశారు.