కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీతకు సంగం నరేంద్ర ప్రోత్సాహం

వైజాగ్: ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించడం పవన్ కళ్యాణ్ గారి ఆశయమని జనసేన పార్టీ 91వార్డ్ అధ్యక్షుడు సంగం నరేంద్ర చెప్పారు. కరాటే బ్లాక్ బెల్ట్ సాధించిన పాత గోపాలపట్నం కి చెందిన చంద్రశేఖర్ కి కరాటే కిట్ బహుకరించి అభినందించారు. నరేంద్ర మాట్లాడుతూ చంద్రశేఖర్ తన ప్రతిభను యువతకు అందించాలని కోరారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ 91 వార్డ్ లో ఉండే యువతకు ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తానని చెప్పారు. కార్యక్రమంలో 91 వార్డ్ నాయకులు అందరు పాల్గొన్నారు.