జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేశవబట్ల విజయ్

తాడేపల్లిగూడెం: నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. నియోజక వర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవబట్ల విజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొన్ని కోట్ల మంది బలిదానాలు వళ్ళ మనం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రం అనుభవిస్తున్నాం అని వారిని స్మరించుకోవడం భారతీయుడి గా మన అందరి బాధ్యత అని అన్నారు .స్వతంత్రం వచ్చాక ఈ దేశంలో వున్న ప్రతి ఒక్కరికీ ఒకే హక్కు కలిగి వుండేలా అన్ని మతాలకు సమానం అయిన గౌరవం దక్కేలా ప్రతి వెనుక బడిన కులానికి ప్రోత్యహం ఇచ్చేలా మహనీయులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన అంబేడ్కర్ గారి కృషితో ప్రపంచంలో లోనే గొప్పది మరియు అత్యంత పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈరోజు మన అందరి జీవితాలలో వెలుగులు నింపింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ యువజన అధ్యక్షుడు అత్తిలి బాబి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి తుమరాడ చిన్నా బీసీ నాయకులు మట్ట రామకృష్ణ గారు సందక రమణ గారు ముఖేష్ గారు కోనేటి సుధీర్ తదితర బీసీ నాయకులు పాల్గొనడం జరిగింది.