వీరఘట్టం మండలంలో యువశక్తి ఆత్మీయ సమ్మేళనం

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, పాలకొండ నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో నిర్వహించిన జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలు, జనసైనికులకు, వీరమహిళలను కలిసేందుకు యువశక్తి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని బుధవారం వీరఘట్టం మండలం నడిమికెళ్ల, కంబర వలస, విక్రమపురం గ్రామలలో నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా యువతతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిలుగా నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొని యువతకు దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స. పుండరీకం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వై.ఎస్. జగన్ అరాచక పాలనతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడి ఉపాధి అవకాశాలు కరువైంది, వైస్సార్సీపీ పాలనలో మోసపోయిన యువత లో ఆత్మస్థైర్యాన్ని నిఒపేఒదుకు యువశక్తి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారు వంద మంది యువతలో ఉన్న ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా ఈ యువశక్తి ద్వారా సీఎం కి, మంత్రులకు కనువిప్పు కలిగేలా చేసారని తెలిపారు. ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నాయకులు బి.పి.నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి లో జాబ్ కేలండర్ అన్నారు, ఇంతవరకు జాబ్ కేలండర్ ఎక్కడ అని ప్రశ్నించారు?. మీ అందరూ మీ తల్లిదండ్రులకు, బంధువులకు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి వివరించి, వారిని కూడా జనసేన పార్టీలోని భాగస్వామ్యం చేయాలని కోరారు. జనసేన జాని మాట్లాడుతూ మాట్లాడుతూ యువశక్తి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ జనసేన పార్టీ తరుపున అభినందనలు. ఇదే ఉత్సాహంతో మీ గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు. దండేల సతీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు రక్షణగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు లీగల్ సెల్ ద్వారా నియోజకవర్గానికి ఒక లాయర్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా బూతు స్థాయిలో మీ మీ గ్రామలలో జనసేన పార్టీ మ్యానిఫెస్టోని వివరించి, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తు కి ఓటు వేసేవిధంగా మార్పు తీసుకురండి అన్నారు. జామి అనిల్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే, యువతకు ఉపాధి అవకాశాలు దక్కలంటే జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందు, పోలీస్, సుధ, మహేష్, ముద్ద సంతోష్, రాంబాబు, వావిలపల్లి నాగభూషన్, కర్ణేన సాయి పవన్ మరియు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు.