కేజీ టు పీజీ ఉచిత విద్యా పథకం అంటివి.. ఏడపోయే నువ్విచ్చిన మాట..?: చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి

హుస్నాబాద్: విద్యా వ్యవస్థకు పట్టిన మకిలి పోయేవరకు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పోరాటం చేస్తూనే వుంటుందని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన్ మాట్లాడుతూ.. మాట ఇచ్చుడు తూచ్.. అది గట్ల గాదు ఇంకో తీరు అని చెప్పుడు మన తెలంగాణ సర్కారు కు అలవాటు… మల్లోకసారి దొఖా చేసిండ్రు ప్రజలను. మూడు నెలల కింద తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు అట్టహాసంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి ఒక్కరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు, నోట్ బుక్ లు కూడా పంచుతామని మాట ఇచ్చి ఇప్పుడు మాట మర్షిండ్రు సర్కారోల్లు. 6 నుండి 12వ తరగతి చదువుతున్న పిల్లలకు మాత్రమే నోట్ బుక్ లు పంచుతున్నారు… 6, 7వ తరగతి కి 200 పేజీల 6 నోట్ బుక్ లు, 8వ తరగతి కి 7 నోట్ బుక్ లు, 9,10వ తరగతికి 14 నోట్ బుక్ లు, 11, 12వ తరగతికి 12 నోట్ బుక్ లు ఈ 6వ తేది నుండి 14వ తేదీకి మధ్య ఇస్తున్నాం అని చెబుతున్నారు. కానీ ఇవి కూడా అందేది జూలై ఆగస్ట్ నెలలోనే అందుతాయి.. 1 నుండి 5వ తరగతి గవర్నమెంట్ విద్యార్థులు ఏమి పాపం చేశారు. వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాదా..?. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం నడిపే విద్యా సంస్థలను, వ్యవస్థను బాగు పరిచి పటిష్టం చేసి అందరినీ సమానంగా సుహృద్భావంతో చూడటం మీ బాధ్యత. పాఠశాలలు మొదలయ్యే లోపు మాలిక వసతులు కల్పించి సర్కారు బడులకు పూర్వ వైభవం తీసుకురండి. మా జనసేన పార్టీ నుండి ప్రభుత్వానికి సూటి ప్రశ్న. కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య అంటివి.. ఏడపోయే నువ్విచ్చిన మాట..?. ఓ తెలంగాణ రాష్ట్ర కాపలా కుక్క లెక్క ఉంటా అనిన ముఖ్యమంత్రి గారు.. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన మీకు గుర్తు చేస్తున్నాం 150 కోట్లలో మీ ఇంటి వాటా ఎంత?. ఈ నోట్ బుక్ ల వ్యవహారంలో మీకు ముడుపులు అందాయా..?. మీరు పంచే నోటు పుస్తకాలకు మీరు దానికోసం వెచ్చించిన 150 కోట్లు లెక్క సరిపోవడం లేదు. విద్యా వ్యవస్థకు పట్టిన మకిలి పోయేవరకు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పోరాటం చేస్తూనే వుంటుంది. మకిలి పట్టిన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చెయ్యడం జనసేన ధ్యేయమని చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.