కులాలను కలిపే విధానంతోనే రాజ్యాధికారం సాధ్యం

  • మన కులాన్ని ప్రేమిద్దాం.. ఇతర కులాలను గౌరవిద్దాం
  • నూటికో కోటికో ఒక్కరు.. అతనే పవన్ కళ్యాణ్
  • కాపులు పెద్దన్నయ్య పాత్ర పోషించాలి
  • బలిజ కార్తీక వనభోజన మహోత్సవంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిట్వేల్: కులాలను కలిపే విధానంతోనే రాజ్యాధికారం సాధ్యమని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా చిట్వేల్ లో జరిగిన బలిజల కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులు పెద్దన్నయ్య పాత్ర పోషించాలన్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కులాన్ని ప్రేమించాలని, ఇతర కులాలను గౌరవించాలన్నారు. అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న మంచిని చూసి నేర్చుకోవాలన్నారు. ఏ కులాన్నీ ధ్వేషించవద్దు, దూషించవద్దన్నారు. పదేళ్ల ముందు ఒక్కడిగా ప్రధానమంత్రి పక్క కూర్చున్న పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత బలమైన శక్తిగా ఎదిగి మళ్లీ అదే ప్రధాన మంత్రి పక్కన కూర్చున్నారన్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రే పవన్ కళ్యాణ్ ను సోదరుడుగా సంబోధించడం సంతోషించదగ్గ విషయమన్నారు. నూటికో కోటికో ఒక్కరు ఉంటారని.. ఆయనే పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ కు కాపులంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం చూడని సామాజిక వర్గాలను అధికారంలో కూర్చో బెట్టేందుకు కాపులు పెద్దన్నయ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, ఎమ్మెల్సీ రామ చంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, పి వి ఎస్ మూర్తి, వంగవీటి రాధా, ఆమంచి స్వాములు, దాసరి రాము, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నా రాయల్, జిల్లా కార్యదర్శి ఆనంద్, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, లక్ష్మీ, తిరుపతి నగర కమిటీ సభ్యులు హేమంత్, కోకిల తదితరులు పాల్గొన్నారు.