ప్రతిభా సేవలకు ఘన సత్కారం

స్థానిక ఏ.ఎం.ఏ.ఎల్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో.. ఆజాధిక అమృత మహోత్సవంలో భాగంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు సేవా పురస్కాలను అందించారు..

ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. జి జయ బాబు ప్రారంభించారు.. ముందుగా శౌర్య పతాకం అశోక్ చక్ర అవార్డు గ్రహీత కీ.శే.కరణం నాగ వరప్రసాద్ తల్లిదండ్రులకు ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది… అదేవిధంగా అనకాపల్లి సమీపంలో గల వెంకుపాలెం గ్రామంలో నెలకొల్పిన హృదయశాంతి వృద్ధాశ్రమంలో సేవలు అందిస్తున్న ఆ సంస్థ నిర్వాహకులు ఉదయ్ మరియు అచ్చుతాపురం సమీపంలో కొండకర్ల ప్రాంతంలో అనాధ పిల్లలకు ఆశ్రయిస్తున్నటువంటి ఇచ్ఛా ఫౌండేషన్ నిర్వాహకురాలు మధు మేడం మరియు పత్రికా రంగంలో సంచలన వార్తాపత్రికగా పేరుందిన లీటర్ పత్రికా విలేఖరి మళ్ళ భాస్కర్ రావు (జర్నలిస్ట్), విద్యార్థి దశనుండే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సాయానికి 10 రూపాయలు అనే సంస్థను స్థాపించి.. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలకి ప్రతినెల బ్లడ్ సమకూర్చే విధంగా ఎన్నో బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నటువంటి ఏసుబాబు కు, 15 సార్లు బ్లడ్ డొనేట్ చేసి, న్యూ మానవసేవే- మాధవసేవ… సంస్థను స్థాపించి పలు రకాల బ్లడ్ క్యాంప్స్ నిర్వహిస్తూనటు వంటి దాడి భాను అనిల్(కంప్యూటర్ లెక్చరర్)కు, ఎన్ సీసీ విభాగంలో అత్యుత్తమ సేవలందించినందుకు గాను ఏఎస్ఎన్ మూర్తి (ఎకనామిక్స్ లెక్చరర్), గార్డెనింగ్ వర్క్ లో విశిష్ట సేవలను చేస్తున్నటువంటి శీరా దుర్గారావు కు, స్వీపర్ వడ్డాది చిన నూక రాజు కు ఈ పురస్కారాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులు బాలకృష్ణ చేతులమీదుగా సన్మానించడం జరిగింది. ఈ కార్య్రమానికి కళాశాల సూపరిండెంట్ అనురాధ, డిపార్ట్మెంట్ హెచ్.ఓ.డి లు మరియు కళాశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *