గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో కార్మికదినోత్సవ వేడుకలు

మదనపల్లె మండలం, పుంగనూరు రోడ్డు నందు శ్రీవారి గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను మే డే సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనియర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ ఇంతకు ముందు కార్మికులందరిని పెట్టుబడిదారులు బానిసలుగా చూస్తూ రోజుకి 20 గంటలు పని చేయించుకుంటున్న రోజుల్లో అమెరికాలోని చికాగో నగరంలో మొదలైన ఉద్యమం కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని రోజుకి ఎనిమిది గంటలు పని గంటలుగా, ఎనిమిది గంటల విశ్రాంతిగా ఎనిమిది గంటల రిక్రియేషన్ కి మాకూ హక్కు కావాలని విపరీతమైన పోరాటం జరిగింది. అలాగే 1862లో వెస్ట్ బెంగాల్ లోని కలకత్తాలో వీళ్ళ హక్కుల కోసం కొన్ని వందల మంది కార్మికుల ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా ఈ మే డే ని జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి విభాగ నాయకులు జగదీష్, మదనపల్లె రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, జనార్ధన్ రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.