పుల్లయ్యకు నివాళులు అర్పించిన లంకా నరసింహారావు

ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలం, నేకునాంబాద్ గ్రామంలో యామ పుల్లయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో పాటు మండల జనసేన పార్టీ నాయకులు ముంతల మధు సుధన్ రెడ్డి, బెల్లంకొండ శ్రీనివాసులు తదితరులు నివాళులు అర్పించారు.