అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘననివాళులర్పించిన జనసేన నాయకులు

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములుని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా స్మరిస్తూ నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ సర్కిల్ నందు గల ఆయన విగ్రహానికి జనసేన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్, పట్టణ అధ్యక్షుడు సుజయ్ బాబు దుగ్గశెట్టి, ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు తదితరులు మాలలు వేసి జనసేన పార్టీ తరపున నివాళులర్పించారు.