రోడ్ల దుస్థితిపై గళమెత్తిన జనసేన నాయకులు

*గజాన ఒక గోయ్య అడుక్కో గుంత గలమెత్తిన జనసేన నాయకులు

*3 వ రోజు #GoodMorningCMSir

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం వెంకటాపురం గ్రామం వయ గంగాధరపురం మీదుగా పైడాయవలస గ్రామం మరియు కోత్తకుంకాం గ్రామం వరకు వెల్లి రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారు అయ్యింది. ప్రజలకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించకుండా మాటలు దాటవేస్తు రహదారులు దుస్థితిని పట్టించుకోని ప్రభుత్వం వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు రోడ్లు సమస్యలపైన గలమెత్తారు. రోడ్లు సమస్యను పవన్ కళ్యాణ్ గారు దగ్గరకి చేరే విధంగా మరియు ఇప్పుడు ఉన్న వైసిపి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మాచుట్టు ప్రక్కల 25 గ్రామాలకు ఆరోడ్డు పైన వెల్లి రావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పిల్లలు వెల్లి రావడానికి చాలా ఇక్కట్లు పడుతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు అక్కడిక్కడే మధ్యలోనే డిలివరీ అయ్యే పరిస్ధితులు ఉన్నాయి. వైద్యం, విద్య, రోడ్లు సౌకర్యాలు ప్రజలకు అందేవిధంగా ఉండాలని కాని ప్రజలకు ఈ అన్యాయం జరిగితే జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా #GoodMorningCMSir కార్యక్రమంలో కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు. లక్ష్మునాయుడు, కోత్తకుంకాం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు యంపిటిసి అభ్యర్థి వడ్డిపిల్లి శ్రీనువాసరావు, గోవిందపురం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు యంపిటిసి అభ్యర్థి అదపాక అప్పలరాజు, ప్రజలకు నాయ్యం జరిగే వరకు సమస్యను పరిస్కరం జరిగే వరకు పోరాటం సాగిస్తాం. ఈరోడ్లు సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని జనసేనపార్టీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో గౌరి నాయుడు, శివరాం, శ్రీను, భూపతి, నాగేశ్వరరావు, అప్పలనాయుడు, గణపతి, శివాజి, రఘురామ్, రమణ, త్రినాథ్, మంగమ్మ, సావిత్రి, నారాయణమ్మ, రాములమ్మ, విజయ్, తవుడమ్మ, నాగమ్మ, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.