డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీలను భలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్ననికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని అధికారులు గతంలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కాలేజీల్లో డ్రాపవుట్స్ ను నివారించడం తో పాటు విద్యార్దులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కాలేజీల్లో విద్యార్దులకు మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రబుత్వం గుర్తించిందని సియం చెప్పారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.