తెలంగాణ ప్రభుత్వానికి అనుగుణంగానే హైకోర్టు తీర్పు

సచివాలయం కూల్చివేత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుగుణంగానే హైకోర్టులో తీర్పు లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పాత భవనాల కూల్చివేతను కొనసాగించేందుకు న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణా సమితి ఉపాధ్యక్షుడు పి యల్ విశ్వేశ్వర రావు, తెలంగాణా ఇంటి పార్టి అధ్యక్షుడు సుదాకర్ గతoలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసినదే. దీని ఫై గత వారం రోజులుగా సుదీర్గంగా విచారించి దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.  

కొత్త భవనాలను నిర్మించే క్రమంలో పాత వాటిని తొలగించడానికి కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం నూతన నిర్మాణాలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమన్న అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ప్రస్తుతమున్న భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని తాము అoగీకరిస్తున్నామని తెలిపింది. అలాగే కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.