అహింసే ఆయుధంగా స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడు గాంధీ: ఆదాడ మోహనరావు

🔸 జనసేన పార్టీ అధ్వర్యంలో గాంధీ జయంతి వేడకలు

🔸 జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహణ

జనసేనపార్టీ అధ్వర్యంలో సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, ఆదివారం ఉదయం మహాత్మా గాంధీ జయంతి వేడుకల్ని స్థానిక శ్రీ కన్యకపరమేశ్వరి ఆలయం వద్దనున్న మహాత్మా గాంధివిగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా జనసేన నాయకులు మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కన్యకాపమేశ్వరి అలయప్రాంతం, మెయిన్ రోడ్డులో జనంలోకి జనసేనకార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు అదాడ మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి ఎందరో మహనీయుల త్యాగాలఫలితమే నేడు మనమంతా స్వేచ్చాస్వాతంత్రాలను అనుభవిస్తున్నామని, అహింసే ఆయుధంగా చేసుకుని అనాటి తెల్లదొరల నిరంకుసత్వ పాలనకు చరమగీతం పాడిన మహనీయులను ప్రతీఒక్కరూ ఆదర్శంగా తీసకోవాలన్నారు.

జనసేన పార్టీ బలోేతానికి, ప్రస్తుత పాలనలో ప్రజలు పడుతున్న అవస్థలను తెలిపేందుకే ప్రజానీకానికి కరపత్రాలరూపంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జీల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు), వంక నరసింగరావు, దంతులూరి రామచంద్ర రాజు, సాయికుమార్, పాల్గొన్నారు.