టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన దారం అనిత

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర 30 కోట్ల ఆర్థిక సహాయం తన సొంత నిధుల నుండి ఇస్తున్న సందర్భంగా తయారు చేసిన చేసిన గోడ ప్రతులు మరియు వాహన స్టిక్కర్లు సోమవారం మదనపల్లిలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత ఆవిష్కరించడం జరిగింది.. ఈ సందర్భంగా శ్రీమతి అనిత మాట్లాడుతూ.. మొదటి విడతగా రైతు కౌలు రైతు భరోసా యాత్ర అనంతపురం.. రెండవ విడత వెస్ట్ గోదావరి జిల్లాలో.. మూడో విడత కర్నూలు జిల్లాలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వైకాపా ప్రభుత్వం స్థాపించాక మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే వారి వైపు చూసే నాధుడు లేక నిరుత్సాహంతో ఉన్న కౌలు రైతులకు నేనున్నానంటూ వాళ్ళల్లో ఆస్మా దైర్యం పెంచి చనిపోయిన ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు తన సొంత నిధి నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందజేస్తున్నారు.. ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల అడ్డంకులు ఏర్పడి నిర్విఘ్నంగా యొక్క కార్యక్రమం ప్రతి జిల్లాలో జయప్రదం అవుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా టీం పిడికిలి ఈ యొక్క గోడ ప్రతులను వాహన స్టిక్కర్లను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పంపిణీ చేయడం హర్షదాయకం.