కొత్తపేట నియోజకవర్గంలో జనసేనలో భారీ చేరికలు!

  • జనసేనాని తప్పు చెయ్యడు!.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే గొప్పగా సేవ చేస్తాడు! కొత్తపేట నియోజకవర్గంలో బొబ్బర్లంక గ్రామంలో భారీ చేరికలు!.. బలోపేతమైన జనసేన పార్టీ!: బండారు శ్రీనివాస్ జనసేన ఇన్చార్జ్!
  • జనసేనానిలో స్వాతంత్ర సమరయోధుడు కనిపిస్తున్నాడు! మార్పు కోరుకుంటున్న ప్రజలు, జనసైనికులు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆత్రేయపురం మండలంలోని, బొబ్బర్లంక గ్రామానికి చెందిన టిడిపి పార్టీ మాజీ ఎంపీటీసీ చల్లా వెంకన్న తన అనుచరులతో ప్రముఖ నాయకులు బెజవాడ సతీష్ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజక వర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్, సమక్షంలో జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. వీరి చేరికను ప్రత్యేకంగా ఎంతో ఆత్మీయతో ఆహ్వానం పలికి, బెజవాడ శ్రీనివాస్ నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని, అదేవిధంగా ఆత్రేయపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు జనసేన పార్టీని ముందుండి నడిపిస్తూ ఉన్నారని, అందరి కలియకతో, కులాలకు, వర్గాలకు అతీతంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని, ప్రజలు ఎంతో విశ్వసిస్తూ ఉన్నారని, ప్రజల్లో మార్పు, చైతన్యము వచ్చిందని, ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ వారి వెంటే అన్ని వర్గాలు వారు ఉంటారని, కొత్తపేట నియోజకవర్గంలో ప్రతిరోజు జరిగే ఈ చేరికలే! మార్పుకు నిదర్శనమని, బండారు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన, చల్ల పూడి శ్రీనివాస్ పార్ల ఖాళీబె, చిట్టా జాన్, అంకిరెడ్డి జాన్, ప్రతి ఒక్కరికి, జన సైనికులకు కార్యకర్తలకు వీర మహిళలకు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.