యానాది సామాజిక వర్గం నుండి జనసేనలోకి భారీ చేరికలు

పెడన నియోజకవర్గం పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ఎస్టి (యానాదులు) సోదరులు పెద్ద ఎత్తున జనసేన పిఏసి చిర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. గూడూరు మండలం కత్తులవాని పాలెం గ్రామంలో ఓ కార్యక్రమంలో జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. చెట్టు పాండు, మర్రి రాజేష్, మర్రి ఏడుకొండలు, మర్రి కృష్ణ, మర్రి మారేష్, మర్రి హనుమంతు, మర్రి నాగరాజు, గంధం గోపాలం, కొమిరగిరి శివ, మర్రి శివ, మర్రి పెద్దిరాజు, మర్రి గజేంద్రరావు, గంధం చందర్రావు, తుపాకుల సుబ్రమణ్యం, గంధం రమేష్, కొమరగిరి గోపి, గంధం పైడి, మర్రి కృష్ణ, చెట్టు మారేష్, చెట్టు రాజారావు, కొమరగిరి రమణ, చెట్టు మరియ, మర్రి రాములమ్మ, గంధం నాగేశ్వరమ్మ, మర్రి వాకలమ్మ, కొమరగిరి మారెమ్మ, మర్రి వీరమ్మ, మర్రి నాగమణి, తుపాకుల నాగమణి, మర్రి మాంకాలమ్మ, మర్రి నాగమణి, మర్రి దానమ్మ, గంధం దుర్గ, తుపాకుల దుర్గ, మర్రి రాజమ్మ, మర్రి పార్వతి, చెట్టు అన్నపూర్ణమ్మ, తుపాకుల ఏసుబాబు, తుపాకుల వెంకట్రావు, తుపాకుల రాజమ్మ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు ఎస్టీ సోదరులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరిరామ్, జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, మండల అధ్యక్షులు కార్యదర్శులు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొనడం జరిగింది.