దుర్గాడలో మే డే వేడుకలు

తుని, మేడే సందర్భంగా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన భవన కార్మికుల మేడే ఉత్సవాలు సందర్భంగా జెండా ఆవిష్కరణ, బహిరంగసభ దుర్గాడ భవన్నారాయణ స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసియున్నారు.”మే”డే ఉత్సవాల కార్యక్రమానికి జనసేన నాయకుల జ్యోతుల శ్రీనివాసు ముఖ్యాతిధిగా హజరై ముందుగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ… శ్రమ ను దోపిడీ జరిగే సమయంలో శ్రమ దోపిడిని ఆపుజేసి శ్రమకు పని గంటలను, పని విరామ దినాలను పోరాటాల ద్వారా కార్మికుల హక్కులను సాదించుకొన్నా రొజునే “మే డే ” గా చెప్పకొవచ్చని అన్నారు. మన ప్రభుత్వాలు కార్మికులు పట్ల చిన్నచూపు చూస్తున్నాయి. గత ప్రభుత్వం భవననిర్మాణ కార్మికుల ప్రమాదభీమ, ప్రసూతి
వివాహ కార్యక్రమనకు పొత్సహాకాలు ఇవ్వడం జరిగినది. కాని నేటి ప్రభుత్వం ఎటువంటి పోత్సహాకలు ఇవ్వడం లేదని దీని కారణంగా భవననిర్మాణ కార్మికులుకు తీవ్రమైన నష్టం జరుగుతుందని రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి భవన నిర్మాణకార్మికులను కాపాడడం జరుగుతుందని జ్యోతుల శ్రీనివాసు హామి ఇచ్చారు. దుర్గాడ భవనకార్మికులు స్దలం సేకరించుకుంటే భవన కార్మికులకు కార్యాలయం జ్యోతుల శ్రీనివాసు సొంత నిధులతో నిర్మాణం చేసి ఇస్తాని హామి ఇచ్చారు. అనంతరం భవననిర్మాణ‌ కార్మికులు 80 మందికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల అర్జుబాబు, గట్టెం వీరబాబు, గొల్లపల్లి అయ్యన్న, గుళ్ళ ఏసుబాబు, కోరకుప్ప సురేష్, గారపాటి సూర్యనారాయణ, గొల్లపల్లి వీరబాబు, తీడా గంగబాబు, కాకినాడ రాము, రావుల తాతారావు, జ్యోతుల సీతరాంబాబు, జీలకర్ర కృష్ణ, మేడిబోయిన సత్యనారాయణ, సాధనాల చంటి రాము, జ్యోతుల శివ, మేడిబోయిన శ్రీను, కొల్లా నాని, కీర్తి చిన్నా, మేడిబోయిన హరికృష్ణ జ్యోతుల చినశివ తదితరులు పాల్గొన్నారు.