కార్మికుల దినోత్సవం సందర్భంగా పొట్టి శ్రీరాములు చలివేంద్రం

ఆత్మకూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సోమవారం నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా కార్మికుల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ చేతుల మీదగా జనసేన పార్టీ ఆత్మకూరు నియోజవర్గ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ మరియు జనసేన పార్టీ సంగం మండలం సీనియర్ నాయకులు మావిళ్ళ ఆనంద్ రావు మరియు జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకులు అత్తిపాటి కృష్ణమోహన్, ఆకులేటి సాయిచంద్, గురవరాజు, నెల్లూరు వెంకటేశ్వర్లు, జయరాజ్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగినది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పొట్టి శ్రీరాములు చలివేంద్రాన్ని సంగం మండల పరిధిలో పోలీస్ స్టేషన్ మరియు తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఆఫీసులుఅందుబాటులో ఉండే విధంగా మరియు పై కార్యాలయం లకు వచ్చే పోయే అధికారులకు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయక్ భాష, చందు, ప్రవీణ్, తిరుమలేష్, రవిచంద్ర, వెంకటేష్, కళ్యాణ్, బాలు, వంశి, వెంకటేష్, బుజ్జిబాబు, పార్వతీష్, సుజిత్, రాయల్, వాసు, వెంకటేష్, శ్రీనాథ్ మరియు జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.