తిరుపతిలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

తిరుపతి: బి.ఎన్ కండ్రిక మండలం, కాటూరు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి 68వ జన్మదినం సందర్భంగా మంగళవారం చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను గ్రామంలో ఉన్న పేదలు మరియు అన్ని వర్గాల వారు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రమణన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రవి, రమేష్, లీలాద్రి, దినకర్ కుమార్, సత్యం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.