డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 18వ వారం

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం నందు గత 15 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 16వ వారం ఈ శనివారం జనసేన నాయకులు, సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వయంగా 800 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రం నందు జనసేననాయకులు, సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వయంగా అన్నపానీయాలను రైతులకు, పశువుల అమ్మకం మద్యవర్తులకు, హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులుఅల్లంకిషోర్, మేడిబోయిన హరికృష్ణ, ఇప్పర్తి శీను, జ్యోతులనాని తదితరులు ఆహరం వడ్డనలో తమ సేవలను అందించారు. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రమునకు శ్రమదానం సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలియజేశారు.