అనకాపల్లికి దూరమైన మంత్రి గుడివాడ అమర్నాథ్

మదనపల్లి: ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కానీ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం రచ్చ మీద కాన్సంట్రేషన్ తో ఇంట గెలవ లేకుండా వున్న పరిస్థితి అనకాపల్లిలో ఉందని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఎద్దేవాచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఆది నుండి అనకాపల్లికి దూరంగా ఉన్నాడు ఫస్ట్ టైం అనకాపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వైఎస్ఆర్సిపి ఇతనికి అధికార ప్రతినిధిగా బాధ్యతలు ఇచ్చింది రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవి తీసుకున్నాక అనకాపల్లికి శాశ్వతంగా దూరమయ్యాడు. అమర్నాథ్ పవన్ కళ్యాణ్ తో ఫోటో వివాదంలో భాగంగా అమర్నాథ్ ను సొంత సామాజిక వర్గం దూరం చేసింది. దాడి వీరభద్రరావు అతని కొడుకు రత్నాకర్ కి ఎంపీ సత్యవతి తోడవడంతో అమర్నాథ్ కి ఇంటి పోరు సొంత ఇంట్లోనే సీనియర్లు దాడులు మొదలయ్యాయి. వైఎస్ఆర్సిపి నిర్వాకం అమర్నాథ్ అలసత్వం వీటికి తోడు భూవివాదం అన్ని కలిసి అనకాపల్లిలో అమర్నాథ్ పని అయిపోయిందని అందరూ చెప్తున్నారు. పక్క నియోజకవర్గం యలమంచిలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు అతని కొడుకు టికెట్ అడుగుతున్నారు. తన కొడుకుకు తప్ప ఈ నియోజకవర్గంలో టికెట్ ఎవరికి ఇచ్చిన వైసీపీ ఓటమి ఖాయమని గట్టిగా చెబుతున్నారు. అలాగే పెందుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్, జిల్లా అధ్యక్షుడు రమేష్ మధ్య టికెట్ వార్ ఉంది. గాజువాక లో పేరు ఉన్న ప్రత్యర్థులు బలంగా ఉండడంతో అది కూడా అసాధ్యం. గుడివాడ అమర్నాథ్ ఓవరాక్షన్ తో దాని రియాక్షన్ పార్టీని అతనిని ఇంకెంత డామేజ్ చేస్తుందో వేచి చూడాలని అనిత అన్నారు.