నోరు అదుపులో పెట్టుకోలేని మంత్రులు తగిన మూల్యం చెల్లించక తప్పదు: చొప్ప చంద్రశేఖర్

సింగనమల నియోజకవర్గం: జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మన రాష్ట్రంలోని మంత్రులకు ప్రజాధనంతో ఏర్పాటు చేసుకున్న సభలలో ఏం మాట్లాడాలో తెలీదు. ఎందుకంటే అసలు వీరు నోటికి ఎంత మాట వస్తే అంత మాట వారి అధినాయకుడు పైశాచిక ఆనందం కోసం ఏదైనా మాట్లాడటం.. అసలు ఈ మంత్రులకు వారి శాఖలపై ఏమాత్రం పట్టులేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే వీరు పనిగా పెట్టుకున్నారు. మొన్న జోగి రమేష్ గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కదా ఎన్ని లక్షలు ఇల్లు ఇస్తామని వాళ్ళు చెప్పారు ఎన్ని లక్షల ఇళ్ళు ఇప్పుడు నిర్మించారు. అది చెప్తే వాళ్ళ మర్యాద ప్రజల్లో పోతుంది కాబట్టి ప్రజల్ని ఏ మార్చడం కోసం పవన్ కళ్యాణ్ గారిని దూషించడం వీరికి ఏమైనా సిగ్గు ఉందా.. అయ్యా జ్యోగి రమేష్ గారు మీరు జగన్ అన్న ఇల్లు పూర్తిగా ప్రభుత్వమే నిర్మించి ఆ ఇంటి తాళాలను గృహిణి చేతిలో పెడతామని చెప్పారు. కదా కనీసం ఒక ఇంటినైనా మీరు చెప్పిన ప్రకారం కట్టించి ఇచ్చారా ఇదేనా మీ హామీలలో 95% హామీలు నెరవేర్చడం అంటే.. ఇలాంటి అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేయలేరు..ప్రజలు గమనిస్తున్నారు నీతి నిజాయితీ గల శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే గానీ మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండదని ప్రజల ఆలోచిస్తున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నోరు అదుపులో పెట్టుకోలేని మధమెక్కిన ప్రతి మంత్రి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలను ఈ వైసీపీ పాలక ప్రభుత్వం సర్వనాశనం చేస్తుంటే ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎలుగెత్తి నినదీస్తుంటే వీరు చేసేది వ్యక్తిగత దూషణలు అంతేకాకుండా వీరికి అధికారం ఉంది కదా అని కక్ష సాధింపు కేసులు పెట్టి బెదిరించాలనుకుంటే మా అధినేత అసలు బెదరడు.. జనసైనికులు అయిన మేము బెదరమని తెలుపుతున్నాం.. మన సింగనమల నియోజకవర్గం పేరుకే దళితుల కేటాయించిన నియోజకవర్గం పెత్తనమంతా అగ్రవర్ణాలదే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అనగారిన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తూట్లు పొడచటమేనా క్లాస్ వారంటే మీ నాయకుడు దృష్టిలో మన రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి ఇస్తే వీరు చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అందుకే మీ చేతగాని పాలనను గమనించి మిమ్ములను ఇంక ఇంటికి సాగనంపక తప్పదు అని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ జి. ఎర్రిస్వామి, మరియు మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.