ఎంపీ గోరంట్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: జనసేన డిమండ్

రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు అత్యాచారాలకు నిలయంగా మారుతోందని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చింతా రేణుకారాజు దుయ్యబట్టారు.. ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి అయిఉండి సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తే ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని అన్నారు… పశు జన్మ ఎత్తాడు కాబట్టే ఒక పశువు లాగా న్యూడ్ వీడియో చేసి రాష్ట్ర మొత్తం అసహ్యించుకునే విధంగా చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడం మీడియాతో సహా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును గంగలో కలిపారు.. అయినా సరే దీనిపైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్టానం అంటున్నారు.. అంటే ప్రభుత్వ పరిపాలన ఏవిధంగా ఉందో అర్థమవుతుంది అని అన్నారు.. ఇకనైనా సత్వరమే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళాలోకమే తగిన బుద్ధి చెబుతారని.. రాష్ట్రంలో ఉన్న మహిళలు అసహ్యించుకునే విధంగా చేసిన వైసిపి పార్టీ గంట, అరగంటల ఎంఎల్ఏ, ఎంపీలని వెంటనే భర్తరఫ్ చెయ్యాలి.. మెగా ఫ్యామిలీ అంటే మీడియా ముందుకు ఎగేసుకొనివచ్చే మహిళా సంఘాలు నాయకులు వైచిపి నాయకులు రోజా, వాసిరెడ్డి పద్మలు ఈ సంఘటన గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం దేనికి సంకేతం అని అన్నారు.. తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది.. అంతేకానీ అధికారంలో ఉన్నవారికి ఒకపద్ధతి.. లేనివారికి మరో పద్ధతి ఉండకూడదు కాబట్టి ఎంపీపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.