జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగిన పాదయాత్ర
  • సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో రెండవ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర చేపట్టిన యువజన నాయకులు తోట పవన్ కుమార్..
  • మహా పాదయాత్రలో త్రిముఖ వ్యూహంతో స్పీడ్ పెంచిన బత్తుల..
  • తోట పవన్ కుమార్ మీద జనం పూల వర్షం కురిపిస్తూ హారతులు పడుతున్న తీరు చూస్తుంటే కన్నుల పండుగ అనిపించకమానదు..

రాజానగరం: ఓటర్ల మనసు గెలిచేందుకు “నిజాయితీయే నా పెట్టుబడి – ఉంటాను ప్రజలకు కట్టుబడి” అనే నినాదంతో బత్తుల బలరామకృష్ణ, వారి నాయకత్వంలో మూడు మండలాలను వారి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, అల్లుడు తోట పవన్ కుమార్ గారు, కుమార్తెలు తోట ప్రత్యూష దేవి, వందనాంబిక త్రిముఖ వ్యూహంతో రెండవ రోజు మహాపాదయాత్ర కొనసాగించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపాదయాత్ర సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో ప్రజలు ఇంటిల్లిపాది అడుగడుగున బ్రహ్మరథం పడుతు స్వాగతించి తీరుతో బత్తుల విజయం కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. కుల మత బేధం లేకుండా ముఖ్యంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను స్థానిక ఎమ్మెల్యే తీరును ప్రజలు దుయ్యబడుతుంటే వారికి అండగా ఉంటామని మాట ఇస్తూ…ప్రజలను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న తీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శాలను పార్టీ సిద్ధాంతాలను వాస్తవ రూపంలో జనం ముందుంచినట్లయిఒది. వృద్ధులు, వీరమహిళలు, జనసేన కార్యకర్తలు, యువత తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, వీరమహిళ శోభ, మదనపల్లిజనసేననాయకులు కుప్పాల శంకర, పాల్గున, ధరణి రాయల్, కిరణ్ కుమార్ రెడ్డి, అశ్వత్, గంగాధర, గణేశ్, మైనారిటీ నాయకులుషేక్ యాసీన్ విద్యార్థివిభాగంఅధ్యక్షుడు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి అంగన్వాడీలతో కలిసి ర్యాలీకి మద్దతిచ్చారు.