పలు వ్యాపారాలు ప్రారంభించిన శ్రీమతి బత్తుల

  • టీ ట్రీట్ ను ప్రారంభించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాలచర్ల గ్రామానికి చెందిన దేవాబత్తుల చిన్న రాజమండ్రిలో నూతనఅంగా మొదలుపెట్టిన టీ ట్రీట్ మరియు జే.ఎస్.ఎన్ జ్యూస్ పాయిన్Y షాపును రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు మరియు నా సేన కోసం నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట కొత్తపల్లి బుజ్జి, సురపరెడ్డి రాజారావు, రాయపాటి చిన్న, రాయపాటి సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.

  • ఫాన్సీ షాపును ప్రారంభించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన గోకడ సూర్యవతి నూతన ఫాన్సీ షాపు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు మరియు నా సేన కోసం నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, ప్రశాంత్ కుమార్ చౌదరి, కొనే శ్రీను, పెద్దపాటి ధర్మ, సత్య సాయి, వనము వెంకటలక్ష్మి, చిట్టాల సుధ, అడ్డగర్ల దుర్గారావు, ముత్యల హరీష్, ప్రసన్న, చీడీపీ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.