పలు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

  • బత్తిన యెహోనుకి 25కేజీల బియ్యం మరియు రూపాయలు 5000/- ఆర్ధికసాయం

రాజానగరం, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామానికి చెందిన బత్తిన యెహోనుకి ప్రమాదంలో చేతికి గాయం కాగా కలవచర్ల జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి, కోలుకునే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి, జనసేన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/- రూపాయలు ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రఘు, పుంగా స్టాలిన్, బొడ్డపాటి నాగేశ్వరరావు, బొల్లి రమేష్, ఎస్ భూషణం, సాట్ల శంకర్, బండారు శ్రీను, సాధనాల సుబ్బారావు, ఛాట్ల రాము ఇతర నాయకులు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

  • సూరి బూసమ్మకు 25కేజీల బియ్యం మరియు రూపాయలు 5000/- ఆర్ధికసాయం

రాజానగరం మండలం, కలవచర్ల గ్రామానికి చెందిన పలు సూరి బూసమ్మ పక్షవాతం వచ్చి పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. కలవచర్ల గ్రామ జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/- రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రఘు, పుంగా స్టాలిన్, బొడ్డపాటి నాగేశ్వరరావు, బొల్లి రమేష్, ఎస్ భూషణం, సాట్ల శంకర్, బండారు శ్రీను, సాధనాల సుబ్బారావు, ఛాట్ల రాము, సుంకర బాబ్జి మరియు ఇతర నాయకులు, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

  • వంగలపూడి నాగేశ్వరావుకి రూపాయలు 5000/- ఆర్ధికసాయం

రాజానగరం మండలం, కలవచర్ల గ్రామానికి చెందిన వంగలపూడి నాగేశ్వరావుకి ప్రమాదంలో చేతికి గాయం కాగా కలవచర్ల జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి, కోలుకునే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి, జనసేన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చి వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రఘు, పుంగా స్టాలిన్, బొడ్డపాటి నాగేశ్వరరావు, బొల్లి రమేష్, ఎస్ భూషణం, సాట్ల శంకర్, బండారు శ్రీను, సాధనాల సుబ్బారావు, చల్ల రాము ఇతర నాయకులు, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.